VIDEO: బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఎర్రబెల్లి ప్రచారం
JN: పాలకుర్తి మండలం కూతులబాద్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మహిళా సంఘాలు కోలాటాలతో ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.