VIDEO: ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, ఎంపి
WGL: గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి, పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డిలు సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఏకవీర ఎల్లమ్మ దేవాలయంను పురావస్తు శాఖ అధికారులతో కలిసి వారు పరిశీలించారు. ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఆలయానికి పూర్వవైభవం తెచ్చేలా కృషి చేస్తామన్నారు.