'కాఫీ వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరి'
ASR: అనంతగిరి, డుంబ్రిగూడ, అరకు మండలాల్లో 2025-26 సంవత్సరానికి కాఫీ క్రయవిక్రయాలు చేసేవారు తప్పనిసరిగా అధికారుల అనుమతులు (లైసెన్స్) తీసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి బాలకర్ణ శుక్రవారం తెలిపారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెర్రీ బోరర్ ప్రభావిత ప్రాంతాల్లో కాఫీ క్రయవిక్రయాలపై ఈ షరతులు విధించినట్లు ఆయన తెలిపారు.