శ్రీ కొత్త పోలమ్మ ఉత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక
PPM: కొత్తవలసలో ఉన్నశ్రీ కొత్త పోలమ్మ అమ్మవారు ఘటాల ఊరేగింపు ప్రారంభం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. ఈ మేరకు బుధవారం స్థానిక TDP కార్యాలయంలో ఎమ్మెల్యేను కొత్తవలస కొత్త పోలమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరువుతానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.