జిల్లాలో ఈనెల 17న జాబ్ మేళా

జిల్లాలో ఈనెల 17న జాబ్ మేళా

NTR: అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, ఎన్ఎస్ ఇన్‌‌స్ట్రుమెంట్స్, కోల్గేట్-పల్మోలివ్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.