పిడుగుపాటుతో ఇద్దరు మృతి

పిడుగుపాటుతో ఇద్దరు మృతి

PPM: బలిజిపేట మండలంలో నిన్న పిడుగుపాటుతో విషాదం నెలకొంది. శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన డొప్ప సింహాచలం (38) మొక్కజొన్న పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది. వంతరాము గ్రామానికి చెందిన వానరాశి పార్వతి కూడా పిడుగుపాటుకు బలయ్యింది. ఈ ఘటనతో గ్రామాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.