జగ్గంపేటలో భారీగా గంజాయి పట్టివేత
కాకినాడ జిల్లా ఎస్పీ జీ. బిందు మాధవ్‌కు అందిన సమాచారం మేరకు జగ్గంపేట పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జే. కొత్తూరు గ్రామంలో ఒడిశా నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 162.075 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.