VIDEO: ప్రొద్దుటూరులో ఘరానా దొంగ అరెస్ట్
KDP: ప్రొద్దుటూరులో ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు దొంగ వద్ద నుంచి సుమారు 18 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని DSP భావన తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల రెండు దొంగతనాల కేసులు నమోదవడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాగా హరీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు.