చేపల చెరువును పరిశీలించిన కేంద్ర బృందం

చేపల చెరువును పరిశీలించిన కేంద్ర బృందం

ప్రకాశం: తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ప్రకాశం జిల్లాలో పర్యటించింది. ఇందులో భాగంగా ఒంగోలు మండలం కొప్పులు, కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామాల్లో నష్టపోయిన చేపల చెరువును సోమవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ మేరకు జరిగిన నష్టం గురించి అధికారులు వారికి వివరించారు. కేంద్ర బృందంతో పాటు కలెక్టర్ రాజబాబు, ఎమ్మెల్యే దామచర్ల, జేసీ, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.