కూకట్ పల్లి ఎమ్మెల్యేకు కవిత కౌంటర్
TG: తనను ఉద్దేశించి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్టేషన్‌ను బయట పెడుతోందన్నారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు రెండు, మూడు రోజుల్లో మీడియా సమక్షంలోనే ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం పనిచేయడం లేదని విమర్శించారు.