'పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుంది'
SKLM: నరసన్నపేట పాత బస్టాండ్ పెట్రోల్ బంకు సమీపంలో విశాలాంధ్ర వాహన పుస్తక ప్రదర్శనను ప్రముఖ వైద్యుడు డాక్టర్ బలగ మురళి సోమవారం ప్రారంభించారు. ఇందులో బాగంగా ఆయన మాట్లాడుతూ.. విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.