VIDEO: పెద్దకడబూరు ఎస్సీ కాలనీలో తాగునీటి ఎద్దడి
KRNL: పెద్దకడబూరు SC కాలనీ మారెమ్మ దేవాలయం వెనుక నివసించే ప్రజలు 45 రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. BC కాలనీలో పైప్‌లైన్‌కు రంధ్రాలు వేసి మోటార్లు పెట్టడంతో తమకు గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని కాలనీవాసులు వాపోయారు. ఈ సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, 'పంచాయతీలో డబ్బులు లేవు' అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారన్నారు.