'భూమిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత'
ASF: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ ఫోర్ట్నెట్' పోస్టర్‌ను కలెక్టర్ హరిత ఆవిష్కరించారు. భూమిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.