భానుడు భగ భగ.. మాడ్గులపల్లిలో 40.5°c
NLG: జిల్లా వ్యాప్తంగా నిన్న సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లడి పోయారు. జిల్లాలోని నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. మాడ్గులపల్లి 40.5 ముల్కచర్ల 40.4, నేరడుగొమ్ము 40.3, ముదిగొండ 40.2, చందంపేట 40.2, నాంపల్లి 40.2. ఈసందర్భంగా జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.