పుట్టపర్తికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాక

పుట్టపర్తికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాక

సత్యసాయి: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నవంబర్ 13 నుంచి 24 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెసేజింగ్ ట్రస్టీ ఆర్.జెే రత్నాకర్ తెలిపారు. ఈ ఉత్సవాలకు 140 దేశాల నుంచి భక్తులు రానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.