'పరిసరాలు పరిశుభ్రత మనందరి బాధ్యత'
SRPT: సూర్యాపేట పట్టణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని పట్టణాన్ని చెత్త రహిత పట్టణంగా చేయుటలో ముందుండాలని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హన్మంత రెడ్డి తెలిపారు. “స్వచ్ఛ సూర్యాపేట” కార్యక్రమం కింద శుక్రవారం స్థానిక 10వ వార్డు కుప్పిరెడ్డి గూడెంలో నిర్వహించిన “పర్యావరణ పరిశుభ్రత అందరి బాధ్యత” నినాదంతో శ్రమదానం కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.