ఆవులు తరలిస్తున్న లారీలను పట్టుకున్న స్థానికులు
MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో బుధవారం అక్రమంగా ఆవులు తరలిస్తున్న మూడు లారీలను స్థానికులు అడ్డగించారు. తూప్రాన్ నుండి సంగారెడ్డికి ఎలాంటి అనుమతి లేకుండా సుమారు 100 గోవులను మూడు లారీలలో తరలిస్తున్నారు. పరిమితికి మించి, అక్రమంగా ఆవులు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.