వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం

వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు మంగళవారం విజయవాడ, సీతారామపురం వాస్తవ్యులు నీరుమల్ల వెంకట భాగ్యరావు అంజనీ దంపతులు వారి కుటుంబ సభ్యులు  రూ.1,00,116  విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన స్వామివారి చిత్రపటాన్ని దాతలకు అందజేశారు.