సెప్టెంబర్‌లో జాతీయ లోక్ అదాలత్

సెప్టెంబర్‌లో జాతీయ లోక్ అదాలత్

WNP: జిల్లాలోని అన్ని కోర్టులలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు మంగళవారం జిల్లా జడ్జి సునీత తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, భూ తగాదాలు, చెక్ బౌన్స్, మోటర్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులను పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.