అనారోగ్యంతో యువకుడు మృతి

అనారోగ్యంతో యువకుడు మృతి

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామానికి చెందిన భీమన్న అనే దినసరి కూలీ నిన్న ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.