VIDEO: రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కార్పొరేటర్

RR: సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్‌లోని ఓ రేషన్ దుకాణాన్ని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి బుధవారం తనిఖీ చేశారు. రేషన్ కార్డుదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసి సబ్బులు ఇతర వస్తువులు బలవంతంగా కొనిపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.