పెరిగిన ఎరువుల ధరలు.. రైతన్నలపై అదనపు భారం

పెరిగిన ఎరువుల ధరలు.. రైతన్నలపై అదనపు భారం

KMM: కేంద్ర ప్రభుత్వం పొటాష్ ధర పెంచడంతో జిల్లా రైతులపై అదనంగా రూ.8.87 కోట్ల భారం పడుతుంది. జిల్లావ్యాప్తంగా 5.91 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ లెక్కన 17,780 మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరం ఉంటుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. పెరిగిన ధర ప్రకారం సుమారు రూ.8.87 కోట్లు రైతులపై అదనపు భారం పడుతోందని రైతులు మండిపడుతున్నారు.