బస్సు బోల్తా ఘటన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

MBNR: పురపాలక పరిధిలోని దివిటిపల్లి శివారులలో ఇవాళ ఉదయం బస్సు బోల్తా పడిన ఘటనలో ఎస్‌వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ మేరకు ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందించాలని ఎస్‌వీఎస్ వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.