నంద్యాలలో 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ
నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 296, రెవెన్యూ క్లినిక్స్‌లో 164 వినతులను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అర్జీలను నిర్లక్ష్యంగా సరైన విధంగా స్పందించని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.