'కేడీ' పాట వివాదం.. దర్శకుడి భార్య పోస్ట్‌ వైరల్‌

'కేడీ' పాట వివాదం.. దర్శకుడి భార్య పోస్ట్‌ వైరల్‌

దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న 'కేడీ: ది డెవిల్‌' మూవీలోని 'సర్కే చునార్‌ తేరీ సర్కే' సాంగ్ వివాదంపై ఆయన భార్య నటి రక్షిత ఇన్‌స్టా వేదికగా స్పందించింది. గతంలో శృంగారభరిత సినిమాలు వచ్చినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆమె ప్రశ్నించింది. విమర్శించే హక్కు ఉన్నా, వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని పేర్కొంటూ.. సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసింది.