నేటి నుంచి ధర్మారంలో హెచ్‌పీవీ టీకాలు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం పిహెచ్‌సీలో సోమవారం డాక్టర్ వైశాలి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి నుండి 90 రోజుల పాటు 14-15 ఏళ్ల లోపు ఆడపిల్లలకు ఈ టీకాలు వేస్తామన్నారు. రామాయంపేట, నిజాంపేట మండలాల పరిధిలోని అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.