మనుషుల అక్రమ రవాణా పై అవగాహన

మనుషుల అక్రమ రవాణా పై అవగాహన

NLG: మనుషుల అక్రమ రవాణాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఈవో బిక్షపతి అన్నారు. నల్గొండ డైట్ కళాశాలలో శుక్రవారం మనుషుల అక్రమ రవాణాపై ఉపాధ్యాయులకు విద్యాశాఖ, ఉజ్వల స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ రామచంద్రయ్య, ఉజ్వల సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సిరాజ్, కోఆర్డినేటర్ సంజీవులు పాల్గొన్నారు.