NIRFలో విజ్ఞాన్ యూనివర్సిటీకి 70వ ర్యాంక్
GNTR: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గురువారం విడుదల చేసిన 2025వ సంవత్సర ఉన్నత స్థాయి NIRFలో విజ్ఞాన యూనివర్సిటీకి 70వ ర్యాంక్ లభించింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ నాగభూషణ్ శనివారం తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో కూడా 80 ర్యాంక్ సాధించినట్లు చెప్పారు. ర్యాంక్ రావడానికి కృషి చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.