వాషింగ్టన్‌లో రికార్డు స్థాయిలో వరదలు 

వాషింగ్టన్‌లో రికార్డు స్థాయిలో వరదలు 

వాషింగ్టన్‌లో రికార్డు స్థాయిలో వరదలు ప్రవహిస్తున్నాయి. దీంతో పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. సియాటెల్‌లోని స్కాగిట్ నది పరిసర ప్రాంతాల్లో 78 వేల మందిని అధికారులు ఖాళీ చేయించారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరిని కాపాడిన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.