బతుకు దెరువుబాటలో.. చదువు చెప్పిన సారు..

బతుకు దెరువుబాటలో.. చదువు చెప్పిన సారు..

NLG: కరోనా కాటుకు ఎన్నో జీవితాలు కకావికలం అయ్యాయి. పలువురు ఉపాధి కోల్పోయి వీధి పాలయ్యారు. ఇదే కోవలో ప్రైవేటు టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బడి పంతుళ్లు రోడ్ల పాలయ్యారు. కొందరు కూరగాయలు అమ్ముతుంటే.. మరికొందరు చిరు వ్యాపారులుగా మారి పొట్టపోసుకుంటున్నారు.