చింతూరులో RTC బస్సుపై రాళ్ల దాడి

చింతూరులో RTC బస్సుపై రాళ్ల దాడి

ASR: భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళుతున్న నైట్ సర్వీస్ RTC బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. చింతూరు (M) ఏడుగురాళ్లపల్లి వద్ద ప్రయాణికులను దించేందుకు ఆగింది. ఆ సమయంలో చీకట్లో అద్దాలను పగులగొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ బస్సును స్టేషన్కు తరలించగా ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు.