విద్యుత్ వాహనాలను ప్రారంభించిన మంత్రి శ్రీహరి

WNP: జిల్లా అమరచింత మున్సిపాలిటీకి హైదరాబాద్ కమిషనర్ కేటాయించిన రెండు ఎలక్ట్రికల్ వాహనాలను సోమవారం మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. మండల కేంద్రంలో టీపీసీసీ ఛైర్మన్ కేశం నాగరాజు గౌడ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ సమక్షంలో ఆయన ఈ వాహనాలను ప్రారంభించి, వాటి తాళాలను మున్సిపల్ సిబ్బందికి అందజేశారు.