ప్రజా వినతుల వేదికకు 33 ఫిర్యాదులు
తిరుపతి నగరపాలక సంస్థలో ఇవాళ జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 33 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఇందులో 24 మంది ప్రత్యక్షంగా, 9 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేశారన్నారు. వర్షానికి పాడైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, అనధికార నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల మంజూరు, శ్మశాన వాటికలో వసతులు వంటి అంశాలపై వినతులు అందాయాన్ని తెలిపారు.