సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవాల్లో  పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మండలంలోని పెద్దతాండలో రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతోత్సవాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేశారని, బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని పేర్కొన్నారు.