చెవులో పువ్వులు పెట్టుకొని నిరసన

JN: జనగామ మండలంలోని గానుగుపాడు, చీటకోడూరు బ్రిడ్జిలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. చేస్తున్న నిరసన నేటికి 17వ రోజుకు చేరుకుంది. కాగా నేడు వారి చెవుల్లో పువ్వులు పెట్టుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. వెంటనే బ్రిడ్జ్ పనులను ప్రారంభించాలని అన్నారు. దీక్షలో ఉద్యమకారులు యాసారపు కరుణాకర్, దడిగె సందీప్, కాటిక అయిలెను, రమేష్, సాంబరాజు ఉన్నారు.