గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్
MNCL: గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ లో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం పెంపొందించి ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించిందుకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు.