ఎరువుల దుకాణం తనిఖీ చేసిన కలెక్టర్

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: నాగారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నిల్వ ఉన్న యూరియా బస్తాలను స్వయంగా లెక్కించారు. యాప్ ద్వారా సాగుతున్న విక్రయాల తీరుపై ఆరా తీశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.