VIDEO: తాడేపల్లిలో ఉద్రిక్తత.. గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆందోళన

VIDEO: తాడేపల్లిలో ఉద్రిక్తత.. గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆందోళన

GNTR: తాడేపల్లిలో బాలాజీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. 20 రోజుల క్రితం బుక్ చేసుకుని ఓటీపీలు వచ్చినా.. ఇంతవరకు సిలిండర్లు డెలివరీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డెలివరీ ఆటోలను కంపెనీ నుంచి బయటకు వెళ్లకుండా మహిళలు అడ్డుకున్నారు. బయట డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు రూ.2వేల నుంచి రూ. 3వేల వరకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు.