పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
కోనసీమ: పి.గన్నవరంలోని బ్రిడ్జి వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను స్థానిక నాయకులు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే అన్నారు.