గురుకుల టీచర్‌పై సస్పెన్షన్ కోసం డిమాండ్
నారాయణపేట గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సిరాజుద్దీన్‌ను సస్పెండ్ చేయాలని SFI, PDSU, ABVP సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 9వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన కేసులో, టీచర్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. హెడ్‌మాస్టర్ సమస్య బయటికి రాకుండా అడ్డుకుంటున్నారని నేతలు ఆరోపించారు. కార్యక్రమంలో నరహరి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.