సర్పంచ్ చెక్ పవర్ రద్దు

సర్పంచ్ చెక్ పవర్ రద్దు

SKLM: ఎల్.ఎన్.పేట మండలం మోదుగు వలస పునరావాస కాలనీ సర్పంచ్ రెడ్డి రామారావు చెక్కు పవర్ మూడు నెలలు పాటు రద్దు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారిణి భారతీ సౌజన్య బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో టెక్కలి డీఎల్‌పీవో ఈ విచారణ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా చెక్ పవర్ రద్దు చేశారు.