ఇరుముడి స్వాములను సత్కరించిన బల్లా పల్లవి
ATP: టీడీపీ నేతలు లోకేష్ రాయల్, యశ్వంత్ రాయల్, డేరంగుల సురేష్ తదితర భక్త స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చెరువు కట్టపై వినాయక స్వామికి పూజలు నిర్వహించారు. అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి వినాయకుని గుడిలో స్వాములను సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలిపి శబరిమల యాత్రకు సాగనంపారు.