VIDEO: రాంగ్ రూట్‌లో వాహనాలు .. ప్రమాదాలకు దారి
SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి వెళ్లే మార్గంలో కొమరబండ జంక్షన్ నుంచి జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు పైగా భారీ వాహనాలు రాంగ్ రూట్‌లో వస్తున్నాయని ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.