వడ్డేమాన్ వాసికి డాక్టరేట్

MBNR: దేవరకద్ర నియోజకవర్గ చిన్నచింతకుంట మండలం చిన్న వడ్డేమాన్ గ్రామానికి చెందిన సిర్రోళ్ళ సౌల్ రాజును డాక్టరేట్ వరించింది. అర్థశాస్త్ర విభాగంలో "నీటిపారుదల-వనరుల అధ్యయనం-మహబూబ్ నగర్ జిల్లాకు సూచన" అన్న అంశంపై ఆయనకు ఉస్మానియా యూనివర్సిటీ గురువారం డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.