'46 గ్రాముల గంజాయి స్వాధీనం'

'46 గ్రాముల గంజాయి స్వాధీనం'

RR: కేశంపేట పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాలిలా.. గురువారం సంగెం శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో ఒడిశాకు చెందిన బిశ్వంత్ మేహార్ అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు పౌల్ట్రీ ఫామ్‌లో తన గదిని తనిఖీ చేసి 46 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.