పోలీస్ పహారాలో యూరియా పంపిణీ

KMR: రామారెడ్డి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. శనివారం రోజున పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. తగినంత యూరియా పంపిణీ చేయకపోవడంతో యూరియా అందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తగినంత యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.