VIDEO: డీజిల్ కొరతతో వాహనదారుల ఇబ్బందులు
W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న పలు పెట్రోల్ బంకుల్లో ఇవాళ డీజిల్ కొరత ఏర్పడింది. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. దీంతో డీజిల్ వాహన దారులు డీజిల్ ఉన్న పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. ఉన్న బంకుల్లో స్టాక్ అయిపోతే పరిస్థితి ఏంటని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ సమస్యను పరిష్కరించాలన్నారు.