హన్మకొండలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

హన్మకొండలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

HNK: కొత్త బస్టాండ్ ప్రాంతంలో నేడు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతి చెందిన వ్యక్తి ప్రయాణికుడా లేక భిక్షాటన చేసుకొని బతికే వ్యక్తా? అనే విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడి వయసు 45 సంవత్సరాలు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రిలో పోలీసులు భద్రపరిచారు.