VIDEO: హైవే డ్రమ్ములు ఢీకొని రోడ్డు ప్రమాదం
NTR: తిరువూరు బైపాస్ సమీపంలోని కోకిలంపాడు క్రాస్ రోడ్డులో శుక్రవారం కారు-లారీ ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములను తప్పించబోయే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్ధరించారు.