'ఎర్రంనాయుడు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు'
SKLM: ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఆదివారం పాతపట్నంలో 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే గోవిందరావు నివాళులర్పించారు. సిక్కోలు ముద్దు బిడ్డగా, జాతీయ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు అని ఎమ్మెల్యే అన్నారు.